ప్రధాని రామగుండం టూర్ నేపథ్యంలో ప్రొటోకాల్ వివాదం..!
* రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇవ్వనున్న మోడీ
ప్రధాని రామగుండం టూర్ నేపథ్యంలో ప్రొటోకాల్ వివాదం
Ramagundam: ఈ నెల 12న ప్రధాని మోడీ రామగుండం టూర్ నేపథ్యంలో ప్రొటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రగడ కొనసాగుతోంది. మోడీ టూర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన ప్రొటోకాల్ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో 90శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని వస్తే అడ్డుకుంటామంటూ ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు సహా పలు సంఘాలు ప్రకటించాయి. దీంతో రామగుండంలో మోడీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.