Hyderabad: చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

Update: 2025-05-18 05:52 GMT

Hyderabad: చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

Fire Accident In Hyderabad : హైదరాబాద్ లోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించినట్లు సమాచారం. మరణించినవారిలో రెండేళ్ల బాలుడు, ఏడేళ్ల బాలిక కూడా ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిప్రమాద సిబ్బంది వెంటనే ఘటనాస్థనానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో చిక్కుకున్న కొంతమందిని రక్షించారు.

ప్రమాద ధాటికి పలువురు స్ప్రుహకోల్పోయారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, హైదర్ గూడ, డీఆర్డీవో ఆసుపత్రులకు తరలించారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ సంఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను పొన్నం ప్రభాకర్ ను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సందర్శించారు.

Tags:    

Similar News