Cyclone Michaung Effect: తెలంగాణకు తాకిన మిచౌంగ్ ఎఫెక్ట్.. వర్షాలకు తడిసి ముద్దైన వరి ధ్యానం

Cyclone Michaung Effect: భారీ వర్షాలకు నీట మునిగిన వేల ఎకరాల పంట పొలాలు

Update: 2023-12-05 09:45 GMT

Cyclone Michaung Effect: వర్షాలకు తడిసి ముద్దైన వరి ధ్యానం.. పంట చేతికొచ్చే సమయంలో రైతులకు తీవ్ర నష్టం 

Cyclone Michaung Effect: ఎపీని అతలాకుతలం చేసిన మిచౌంగ్ తుఫాన్.. తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెల్లవారిజామునుంచే ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిముద్దైంది. ధాన్యం కొనుగోలు ప్రారంభించి నెలరోజులైనా.. నేటికి ఒక్క బస్తా ధాన్యం కూడా తరలించకపోవడంతో.. ధాన్యం పాడైపోయిందని.. రైతులు గగ్గోలు పెడుతున్నారు. దళారులు చేరి.. ధాన్యం తరలించడంలో ఆలస్యంచేశారని.. ఇప్పుడు తడిసిన ధాన్యానికి తక్కువ రేటుకు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా.. సంబంధిత అధికారులు స్పందించి.. సకాలంలో పంటను కొనుగోలు చేయాలని.. తమను ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News