తెలంగాణలో చెలరేగుతున్న కరెంట్ మంటలు.. పోటా పోటీ నిరసనలతో దద్దరిల్లిన రాష్ట్రం
Telangana: కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహం
తెలంగాణలో చెలరేగుతున్న కరెంట్ మంటలు.. పోటా పోటీ నిరసనలతో దద్దరిల్లిన రాష్ట్రం
Telangana: తెలంగాణలో విద్యుత్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి..? ఈ మంటలారేది ఎప్పుడు..? కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా బీఆర్‌ఎస్ వ్యూహం రచిస్తోందా....? బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో తమకు మైలేజీ వచ్చేలా నిరసనలు తెలిపిందా..? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్.. ఎలా కౌంటర్ ఇవ్వనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది..
తెలంగాణలో రైతులకు ఒక ఎకరానికి గంట చొప్పున మూడు గంటల పాటు విద్యుత్ ఇస్తే చిన్న సన్నకారు రైతులకు ఉపయోగం ఉంటుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హీట్ పుట్టిస్తున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తోంది తెలంగాణ సర్కార్.. 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వడంతో పరిశ్రమలు కంపెనీలు రైతంగానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది.. ఇలాంటి సమయంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నయంటున్నారు బీఆర్ఎస్ నేతలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణలో కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉన్నయో.. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదేవిధంగా కోతలు ఉంటాయంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు.. తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్ నేతలు.. వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అదుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని తమ నిరసనల్లో నేతలు దుయ్యబట్టారు..
రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపీతమవుతుంటే బీఆర్‌ఎస్ నేతలు కావాలని రేవంత్ మాటలను వక్రీకరిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు.. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ చూస్తుందని, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజలకు తెలుసని, తెలంగాణలో అధికారంలోని వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేని అన్నారు కాంగ్రెస్ నేతలు.. ఇలాంటి సమయంలో కేసీఆర్ వ్యూహం ఏమిటన్న చర్చ జరుగుతోంది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఒక్క నిమిషం కరెంట్ పోకుండా నిరంతరాయంగా కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.. ఇదే సమయంలో కరెంటుపై కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్... 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడిందీ... పరిశ్రమలు ఏ విధంగా నిలదొక్కుకున్నాయనేది ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కరెంటుపై కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీసేలా చేయడంలో భాగంగా ఇప్పటికే నిరసన ప్రదర్శనలు నిర్వహించిన బీఆర్ఎస్... ఇదే అంశాన్ని ప్రజల్లో లోతుగా చర్చింపజేసి, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారట ముఖ్యమంత్రి కేసీఆర్...