కాంగ్రెస్‌తో పొత్తుపై తాడోపేడో తేల్చుకోనున్న సీపీఐ
CPI: ఇప్పటికే పోటీచేసే నియోజకవర్గాలను ప్రకటించిన సీపీఎం
కాంగ్రెస్‌తో పొత్తుపై తాడోపేడో తేల్చుకోనున్న సీపీఐ
CPI: ఇవాళ సీపీఐ కార్యవర్గం సమావేశంకానుంది. కాంగ్రెస్‌తో పొత్తుపై సీపీఐ తాడోపేడో తేల్చుకోనుంది. కాంగ్రెస్‌తో పొత్తు విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ తీరుపై సీపీఐ నేతలు అనుమానంతో ఉన్నారు. హస్తం పార్టీ చేయిస్తే సీపీఎం బాటలో నడవాలని సీపీఐ భావిస్తుంది. అదే జరిగితే ఏఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై సీపీఐ నేతలు ఇవాళ జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే పోటీచేసే నియోజకవర్గాలను ప్రకటించిన సీపీఎం.. సీపీఐ పోటీ చేసే స్థానాలలో బరిలో అభ్యర్థులను నిలపమంటోంది.