తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(ఆదివారం) ఒక్క రోజే 154 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 94 కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 5 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 142 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3742 కి చేరింది.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,983 కేసులు నమోదు కాగా,206 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,56,611 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,25,381 ఉండగా, 1,24,094 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 7,135 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,08,048. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 47,74,434.