తెలంగాణలో కొత్తగా 1931 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-08-13 03:42 GMT
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(బుధవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,931 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 86,475కి చేరింది. మృతుల సంఖ్య 665కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1780 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 63,074కి చేరింది. ప్రస్తుతం 22,736 మంది చికిత్స పొందుతున్నారు. నిన్నఒక్కరోజే 23,303 మంది నమూనాలను పరీక్షించగా 1,931 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 6,89,150కి చేరింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 298, రంగారెడ్డి జిల్లా 124, వరంగల్ అర్బన్‌ 144, కరీంనగర్ జిల్లా 89, సంగారెడ్డి 86, నల్గొండ 84, ఖమ్మం జిల్లా 73, సిద్దిపేట 71, మల్కాజ్‌గిరి 71, పెద్దపల్లి 64, సూర్యాపేట 64, జనగామ 59, జోగులాంబ గద్వాల 56, సిరిసిల్ల 54, నాగర్‌ కర్నూల్ 53, నిజామాబాద్ 53, జగిత్యాల 52 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 72.93గా ఉంది. దేశంలో 69.79గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.77 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.99 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


Tags:    

Similar News