Metpally: రంజాన్ సందర్భంగా ముస్లిం పెద్దలకు పోలీసుల సూచనలు

Update: 2020-04-22 16:03 GMT

మల్లాపూర్: పోలీస్ స్టేషన్ లో మల్లాపూర్ మండలానికి చెందిన ముస్లిం కుల పెద్దలతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రానున్న రంజాన్ పండగ సందర్భంగా మరియు ప్రస్తుత కరోనా నేపథ్యంలో పాటించవలిసిన నియమ నిబంధనల గురించి ఎస్సై రవీందర్ అవగాహన కల్పించారు.

రంజాన్ పండుగ సందర్భంగా మసీదులలో చేసే నమాజుకు ఐదుగురికి మించి ఉండరాదని, ఇఫ్తార్ విందులు ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై రవీందర్ తెలిపారు. ఈ సమావేశంలో మల్లాపూర్ తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కోటేశ్వరరావు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.




Tags:    

Similar News