Coronavirus in Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్న కరోనా భయం

Coronavirus in Telangana: తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.

Update: 2020-06-27 04:04 GMT

Coronavirus in Telangana: తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ దఫా రాష‌్ట్రవ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సీఎం కేసీఆర్ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో లో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ సడలింపుల తర్వాత పది రోజులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటేనే ముగ్గురు ఎమ్మెల్యే లకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఇంకా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫ్యామిలీ హాస్పిటల్ లోనే వుంది. కరోనా భయానికి మెజార్టీ ఎమ్మెల్యే లు అత్యవసర పనులన్నీ వాయిదా వేసుకుని ఇళ్లలోనే వుంటున్నారు. ఏ కార్యక్రమంలోనూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కుదరటంలేదు అని వాపోతున్నారు.

కరోనా నేపథ్యంలో ఈ సారి హరితహారంలో అటవీ శాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. మొక్క నాటే సమయంలో ఒక్కరు మాత్రమే పాల్గొనాలి. మిగతా వాళ్లంతా దూరంగా ఉండాలి తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అయితే ఇది అసాధ్యం అన్న భావన చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. ఎమ్మెల్యే వెంటే వచ్చే కార్యకర్తలు, గన్ మెన్ లు, అధికారులు, మీడియా అంతా కలిసి 50 మందికి పైగా నే వుంటారు. హరితహారం లాంటి కార్యక్రమంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం వీలు కాదని ఎమ్మెల్యే లు అభిప్రాయపడుతున్నారు.

అధికార టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ల్లో చాలా మంది బిపి, షుగర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. కరోనా భయంతో మూడు నెలలుగా ఇంట్లోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అత్యవసర పనులన్నీ వాయిదా వేస్తున్నారు. ఇంట్లో ఉండి కార్యకర్తలతో, అధికారులతో ఫోన్ లలో మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా హాజరు కావాల్సిన కార్యక్రమంలో కాసేపు కనిపించి వెళ్ళిపోతున్నారు. హరితహారంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా విస్తరణ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడంపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో భయం భయంతోనే హరితహారంలో పాల్గొననున్నారు.


Tags:    

Similar News