DK Aruna: రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు

DK Aruna: నాకు వస్తున్న ఆదరణ చూసి రేవంత్‌ ఓర్వేలేక పోతున్నారు

Update: 2024-05-06 04:13 GMT

DK Aruna: రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు

DK Aruna: సీఎం రేవంత్‌రెడ్డిపై మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైరయ్యారు. తనకు వస్తున్న ఆదరణను చూసి రేవంత్‌రెడ్డి ఓర్వేలేక పోతున్నారని..అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. రైతుల సాగు నీటి కష్టాలను తీర్చడం కోసం గద్వాల నుంచి హైదరాబాద్‌ వరకు 11 రోజుల పాటు పాదయాత్ర చేశానని డీకే అరుణ తెలిపారు. పాలమూరు అభివృద్ధి కోసం పని చేసిన తనపై రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్లలో బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

Tags:    

Similar News