Coronavirus Hotspots: క‌రోనా హాట్ స్పాట్ గా హైద‌రాబాద్.. ఎక్క‌డ చూసినా కొవిడ్ రోగుల ఆర్త‌నాదాలే

Coronavirus Hotspots: కరోనా విలయతాండవంతో నగరంలోని కొవిడ్ హాస్పటల్స్ వద్ద పరిస్థితి దీనంగా మారింది.

Update: 2021-05-10 09:07 GMT

క‌రోనా హాట్ స్పాట్ గా హైద‌రాబాద్.. ఎక్క‌డ చూసినా కొవిడ్ రోగుల ఆర్త‌నాదాలే

Coronavirus Hotspots: కరోనా విలయతాండవంతో నగరంలోని కొవిడ్ హాస్పటల్స్ వద్ద పరిస్థితి దీనంగా మారింది. ఓ పక్క కొవిడ్ పేషంట్స్ కి లోపల ట్రీట్ మెంట్ జ‌రుగుతుంటే బయట వారి బంధువులు, కుటుంబ సభ్యుల పరస్థితి వర్ణనాతీతం. నిద్రాహారాలు మాని, తిండి తిప్పలు లేక వారు క్ష‌ణ‌మొక యుగంలా గుడుపుతున్నారు.

క‌రోనాకు హైద‌రాబాద్ న‌గ‌రం హాట్ స్పాట్ గా మారింది. న‌గ‌రంలోని కింగ్ కోఠి, గాంధీతో పాటు ఇత‌ర ఆసుప‌త్రులను కొవిడ్ హాస్పటల్స్‌గా మార్చి పేషంట్స్‌కు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి కొవిడ్ చికిత్స అందిస్తున్న గాంధీ హాస్పటల్ వద్ద మాత్రం పరిస్థితులు మరీ దుర్భరం. న‌గ‌రంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కొవిడ్ పేష్ంట్స్ లోపల చికిత్స పొందుతుంటే వారితో వచ్చిన కుటుంబీకుల పరిస్థితి మరీ దీనంగా మారింది. పేషంట్‌తో లోప‌ల ఉండలేక బయట ఉండే వసతి లేక ఫుట్ పాత్‌లు, మెట్రో స్టేష‌న్ మెట్లు దిక్కయ్యాయి.

మరోవైపు లోపల పేషంట్ ఎలా ఉన్నారో అన్న టెన్షన్ వారిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రీట్‌మెంట్ ఎలా సాగుతుందో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వారిని కుంగతీస్తుంది. సుదూర ప్రాంతాల నుండి వ‌చ్చే పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారి ప‌రిస్ధితి అయితే మ‌రీ దారుణం. హోట‌ల్స్ లో ఉండే స్తోమ‌త లేక‌ గాంధీ గేటు వ‌ద్దే రాత్రి,పగలు పడిగాపులు కాస్తున్నారు. ఆఖ‌రికి భోజ‌నం చేయాల‌న్న కొందరికి భారంగా మారింది. స్వ‌చ్ఛంధ సంస్ధ‌లో లేక ఎవరైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్ప తినలేని పరిస్థితి ఏర్పడింది. న‌గ‌రంలోని క‌రోనా హాస్పట్స్ ముందు కనిపిస్తున్న దయనీయ దృష్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇన్ని కష్టాలతో వారు కరోనాతో పోరాడుతున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News