Pre-Booking Beds in Private Hospitals: ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల రిజర్వేషన్‌.. ప్రీ-బుకింగ్‌ చేసుకుంటున్న అతి జాగ్రత్తపరులు

Pre Booking Beds in Private Hospitals: ప్రజలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా, సమాజిక దూరం పాటించినప్పటికీ కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది.

Update: 2020-07-03 06:15 GMT

Pre Booking Beds in Private Hospitals: ప్రజలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా, సమాజిక దూరం పాటించినప్పటికీ కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. దీంతో రాష్ట్ర ప్రజలంతా బిక్కు బిక్కు మంటున్నారు. ఎక్కడ తమకు కూడా వైరస్ సోకుంతుందో అని భయాందోళన చెందుతున్నారు. మరి కొంత మంది ధనవంతులు తమకు కరోనా సోకితే ఎక్కడ వైద్యం చేయించుకోవాలో కూడా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే డబ్బున్నవారు ముందుజాగ్రత్తగా ప్రైవేటు దవాఖానల్లో గదులను, పడకలను రిజర్వు చేసుకుంటున్నారు. దీంతో ప్రయివేటు ఆస్పత్రులకు ఫుల్ గా గిరాకీ పెరిగింది. ఇదే అదునుగా చేసుకున్న పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు ప్రజల భయాన్ని సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కృత్రిమ కొరతను సృష్టిస్తూ పడకలు లేవంటూ రోగులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. అంతే కాదు సినిమా టికెట్లు అయిపోతే ఏ విధంగా హాల్ ముందు 'హౌస్‌ఫుల్‌' బోర్డు పెడతారో అదే విధంగా కొన్ని దవాఖానలు గేటు వద్ద ఏకంగా 'హౌస్‌ఫుల్‌' బోర్డు పెడుతున్నాయి.

మరి కొన్ని ఆస్పత్రి యాజామాన్యలు తమ వద్ద పడకలు లేవని, ఖాళీ అయిన వెంటనే చేర్చుకుంటామంటూ ముందుగానే అడ్వాన్స్‌ తీసుకుంటున్నాయి. ఇక కొంతమంది సంపన్నులు తమకు వైరస్‌ సోకకపోయినా ముందుజాగ్రత్తగా గదులు, పడకలను అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నట్లు తెలిసింది.సకల సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానలపై సామాజిక మాధ్యమాల్లో సాగిన దుష్ప్రచారం కూడా కొందరు ప్రైవేటు వైద్యం వైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతున్నది. మొత్తానికి హైదరాబాద్‌లో భారీగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రైవేటు దవాఖానలు తమ వద్ద పడకలు దొరకడం లేవనే ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించి ప్రజలను మరింత భయభ్రాంతును చేస్తున్నారు.

ఇక పోతే తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో 9, 226 యాక్టివ్ కేసులు ఉండగా, 9,069మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్న ఎనమిది మంది మృతి చెందారు. నిన్న నమోదైన 1,213 కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 998 కేసులు నమోదు అయ్యాయి. ఇక మిగతా ప్రాంతాలలో చూసుకుంటే రంగారెడ్డిలో 48, మేడ్చెల్ 54, సంగారేడ్డి, మహబూబ్ నగర్ , భద్రాది కొట్టేగుడెం లలో చెరో 7 , కరీంనగర్, మహుబుబాబాద్ , నిజామాబాదు లలో చెరో 5, సూర్యాపేట లో 4, ఖమ్మం 18, నల్గొండ 8, కామారెడ్డి 2, ములుగు 4, వరంగల్ రూరల్ 10, జగిత్యాల్, నిర్మల్ లలో చెరో 4, వరంగల్ అర్బన్ 09, నారాయణపేట 2, సిరిసిల్లా 06, నాగూర్ కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, గద్వాల్, మెదక్, యదాద్రిలో ఒక్కో కేసు నమోదు అయింది. ఇక ఇందులో ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది..నిన్న తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News