కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి: కలెక్టర్ నారాయణరెడ్డి

Update: 2020-04-22 17:09 GMT
Collector Narayana Reddy

నిజామాబాద్: మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే క్షేమంగా ఉంటామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గ్రామస్థాయి, మున్సిపల్ స్థాయి ప్రజాప్రతినిధులకు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీల ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ మహమ్మారి వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ మే 7వ తేదీ వరకు పొడిగించారని, మీ పరిధిలోని ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా అసలు ఏ విధంగా వైరస్ ను కట్టడి చేయడానికి నిర్దేశించిన జాగ్రత్తలన్నీ పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు.

అదే విధంగా ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని మీ తరఫున తెలియజేయాలని ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా మాస్కు తరించాలని చెప్పాలని వెళ్లిన చోట మీటర్ దూరం వ్యక్తికి వ్యక్తికి పాటించే విధంగా జాగ్రత్తగా ఉండాలని తేలు చేయాలన్నారు. అవసరాలకు దుకాణాలకు వెళ్ళినప్పుడు అన్ని విషయాలు పరిశీలించి వెళ్లిన పని చేసుకునే విధంగా చూడాలన్నారు. అదే విధంగా మీ ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడితే వారి పూర్తి వివరాలు సేకరించాలని అనుమానం వస్తే పోలీసులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News