గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య కార్యకర్తల కోర్ కమిటీ సమావేశం
Gaare Venkatesh: ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చి మురిపించారు
గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య కార్యకర్తల కోర్ కమిటీ సమావేశం
Gaare Venkatesh: ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం మాదిగలకు అన్యాయంచేసిందని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గారె వెంకటేశ్ ధ్వజమెత్తారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య కార్యకర్తల కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాటిచ్చి మురిపించారే తప్ప, న్యాయం చేయలేదన్నారు. తరచూ మత విద్వేషాలను రెచ్చగొట్టే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంనుంచి ప్రత్యేక నిధులు విడుదల చేయించి అభివృద్ధిలో భాగస్వామ్యంకావాలని గారె వెంకటేశ్ సూచించారు.