Hyderabad: పంది కొవ్వుతో వంట నూనె.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లకు విక్రయం..

Hyderabad: హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో కల్తీనూనె కలకలం రేగింది.

Update: 2023-06-29 06:30 GMT

Hyderabad: పంది కొవ్వుతో వంట నూనె.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లకు విక్రయం..

Hyderabad: హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో కల్తీనూనె కలకలం రేగింది. ఆర్.కె.పురంలో రమేష్ అనే వ్యక్తి పంది కొవ్వుతో ఆయిల్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్వోటీ పోలీసులు.. రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పంది కొవ్వు నుంచి తీసిన 15 లీటర్ల ఆయిల్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయిల్‌ను వంటనూనెలో కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పంది కొవ్వు నూనెను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News