History of New Secretariat Construction: చరిత్రలో నిలిచిపోయేలా కొత్త సచివాలయ నిర్మాణం

History of New Secretariat Construction: చరిత్రలో కట్టడాలు, వాటిని నిర్మించిన రాజులే మిగిలిపోతారు.

Update: 2020-07-09 10:12 GMT
New Design of Telangana Secretariat

History of New Secretariat Construction: చరిత్రలో కట్టడాలు, వాటిని నిర్మించిన రాజులే మిగిలిపోతారు. ఇప్పడు సీఎం కేసీఆర్ కూడా చరిత్రలో లిఖించేలా కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ఆధునాతన సువిశాల సచివాలయ భవనం నిర్మాణం కాబోతోంది. డెక్కన్ కాకతీయ శైలిలో సమీకృత సెక్రటెరియట్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి.

తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ ఖారారు చేశారు. చెన్పైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్షర్ రూపొందించిన డిజైన్ ను సూత్రప్రాయంగా ఓకే చెప్పారు. ఈ డిజైన్ ప్రకారం డెక్కన్ కాకతీయ శైలిలో సమీకృత సచివాలయ బిల్డింగ్ ఉండనుంది. 500 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం అధునాతన హాల్స్ నిర్మించనున్నారు. ఏడాదిలోనే అన్ని హంగులు, ఆర్భాటాలతో కొత్త సెక్రటెరియట్ నిర్మించనున్నారు.

తెలంగాణ నూతన సచివాలయాన్ని పూర్తి వాస్తు ప్రకారం డిజైన్ చేశారు. కాకతీయుల నిర్మాణశైలిలో విలక్షణ స్మారక చిహ్నంగా కొత్త సచివాలయ నిర్మాణం జరుగనుంది. మొత్తం 25 ఎకరాల స్థలంలో కేవలం 20% మాత్రమే సమీకృత భవన నిర్మాణానికి, మిగిలిన 80% ఉద్యానవనానికి, ఫౌంటైన్ల కోసం వినియోగించనున్నారు.

దీర్ఘ చతురస్రాకారంలో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నయా సచివాలయ భవనం ఉండనుంది. అత్యంత విశాలంగా ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ద్వారం మధ్యలో ఓ పెద్ద గవాక్షాన్ని నిర్మించనున్నారు. పెద్దపెద్ద కారిడార్లు, గాలి, వెలుతురు ధారలంగా ప్రసరించేలా భారీ వరండాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనం ముఖద్వారం తూర్పు వైపుగా ఉండి, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ప్రవేశద్వారం ఉండేలా ఈ నిర్మాణం జరుగనుంది. భవనం మధ్యలో చెట్లు, పచ్చికబయళ్లతో కూడిన రెండు పెద్దవరండాలను ఏర్పాటు చేయనున్నారు.

కాంప్లెక్స్ లో ఓ శిశుసంరక్షక కేంద్రం, దేవాలయం, మసీదు, ఇతర ప్రార్థనా మందిరాలు, క్యాంటీన్, ఫైర్ స్టేషన్, బ్యాంకులు, ఏటీఎంలకు ప్రత్యేక భవనాలు, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ తదితర సౌకర్యాలు కూడా ఉండేలా నమూనాను రూపొందించారు. సచివాలయం పార్కింగ్ లో ఒకేసారి 5వందల కార్లు, విజిటర్స్ పార్కింగ్ లో మరో 3వందల కార్లు పార్క్ చేసేలా వెసులుబాటు కల్పిస్తూ కొత్త నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తానికి కొత్త సచివాలయం అన్ని హంగులతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం కాబోతోంది. కానీ ఓ వైపు ప్రతిపక్షాల విమర్శలు మరోవైపు కరోనా ఎఫెక్ట్ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.


Tags:    

Similar News