Maoists: కుప్పకూలిన మావోయిస్టు కోట.. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టుల లొంగుబాటు..
Maoists: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద మావోయిస్టు లొంగుబాటు ప్రక్రియ శనివారం చోటుచేసుకుంది.
Maoists: కుప్పకూలిన మావోయిస్టు కోట.. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టుల లొంగుబాటు..
Maoists: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద మావోయిస్టు లొంగుబాటు ప్రక్రియ శనివారం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. మొత్తం 4 ప్రత్యేక బస్సుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న వీరు, 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు.
డీజీపీ వెల్లడించిన వివరాలు:
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ లొంగుబాటుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన 130 మందిలో:
ఛత్తీస్‌గఢ్: 125 మంది
తెలంగాణ: 4 గురు
ఆంధ్రప్రదేశ్: ఒకరు ఉన్నారు.
గతంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, అహింసా మార్గాన్ని ఎంచుకుని వీరంతా లొంగిపోతున్నట్లు డీజీపీ తెలిపారు. వీరిలో ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉండటం గమనార్హం.
కుప్పకూలిన పీఎల్‌జీఏ కోట:
మావోయిస్టు పార్టీకి వెన్నెముకగా భావించే పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్ మొత్తం ఈసారి ప్రభుత్వానికి లొంగిపోయింది. అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావు (దామోదర్), నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి వంటి కీలక నేతల గన్‌మెన్లు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు పార్టీకి సాంకేతిక విభాగంలో కీలకంగా పనిచేసే కంప్యూటర్ సిగ్నల్ ఆపరేటర్లు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దేవ్‌జీకి చెందిన పూర్తి పీఎల్‌జీఏ కమిటీ సరెండర్ కావడంతో అడవిలో మావోయిస్టుల నెట్‌వర్క్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లయ్యింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొంగిపోయిన వారితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారికి ప్రభుత్వం తరపున అందించే పునరావాస ప్యాకేజీలు మరియు ఇతర సదుపాయాలపై భరోసా ఇచ్చారు. ఈ పరిణామంతో తెలంగాణలో వామపక్ష తీవ్రవాద అధ్యాయం ముగింపు దశకు చేరుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.