Free Bus: "అంతా ఫ్రీయే కదా".. బస్సులో బ్రష్ చేస్తూ కండక్టర్‌కు చుక్కలు చూపించిన ప్రయాణికురాలు!
Free Bus: ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ఏదో ఒక వింత ఘటన వార్తల్లో నిలుస్తూనే ఉంది.
Free Bus: "అంతా ఫ్రీయే కదా".. బస్సులో బ్రష్ చేస్తూ కండక్టర్‌కు చుక్కలు చూపించిన ప్రయాణికురాలు!
Free Bus: ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ఏదో ఒక వింత ఘటన వార్తల్లో నిలుస్తూనే ఉంది. సీట్ల కోసం కొట్లాటలు, జుట్టు పీక్కోవడాలు చూశాం.. కానీ తాజాగా ఓ మహిళ ఏకంగా బస్సులోనే బ్రష్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
అసలేం జరిగిందంటే?
జిల్లాలోని పదరా మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం పూట బస్సు ఖాళీగా ఉండటంతో ఒక మహిళ కిటికీ పక్కన సీటులో కూర్చుని నిశ్చింతగా బ్రష్ చేయడం మొదలుపెట్టింది. పళ్లు తోముకుంటూ కిటికీలోంచి బయటకు ఉమ్మివేస్తుండటం చూసి తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు.
కండక్టర్‌కే కౌంటర్.. 'అంతా ఫ్రీయే కదా!'
ఇది గమనించిన మహిళా కండక్టర్ సదరు ప్రయాణికురాలిని నిలదీశారు. "బస్సులోనే బ్రష్ చేస్తారా?" అని ప్రశ్నించగా.. ఆ మహిళ ఏమాత్రం తగ్గకుండా చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. "అంతా ఫ్రీయే కదా" అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. అంతటితో ఆగకుండా.. "అరె రామశంకరా.. నేను ఛాయ్ కూడా తాగాలి.. బస్సు ఆపుతావా?" అంటూ కండక్టర్‌కే రివర్స్ కౌంటర్ ఇచ్చింది.
వైరల్ అవుతున్న వీడియో:
మహిళ ప్రవర్తనను చూసి తోటి ప్రయాణికులు తమ మొబైల్‌లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఉచితం అంటే క్రమశిక్షణ లేకపోవడం కాదు" అని కొందరు మండిపడుతుండగా.. మరికొందరు ఆమె సమాధానానికి నవ్వుకుంటున్నారు.