Nizamabad: ట్రాప్ కెమెరాకు చిక్కిన తడోబా పులి.. కమ్మర్పల్లి సమీప గ్రామాల ప్రజలకు హై అలర్ట్!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి అటవీ శ్రేణిలో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Update: 2026-03-06 10:16 GMT

Nizamabad: ట్రాప్ కెమెరాకు చిక్కిన తడోబా పులి.. కమ్మర్పల్లి సమీప గ్రామాల ప్రజలకు హై అలర్ట్!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి అటవీ శ్రేణిలో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ నుంచి ఈ పులి సరిహద్దు దాటి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.

గత వారం రోజులుగా జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అందిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అయితే, తాజాగా కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని 'గట్టు పొడిచిన వాగు' ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పులి కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో పులి ఉనికిని అధికారులు అధికారికంగా ధృవీకరించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. పశువుల కాపరులు తమ పశువులను అటవీ ప్రాంతం లోపలికి తీసుకెళ్లకూడదు. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. చీకటి పడిన తర్వాత అటవీ సరిహద్దు ప్రాంతాల్లో తిరగవద్దని హెచ్చరించారు.

సాధారణంగా మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి పులులు కొత్త ఆవాసాల కోసం తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు వస్తుంటాయి. ప్రస్తుతం ఈ పులి ఎటువైపు వెళ్తుందో పర్యవేక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని, సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని కోరారు.

Tags:    

Similar News