వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి వివాహం.. హాజరై సందడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో వివాహ వేడుకలు అంబరాన్నంటాయి.

Update: 2026-03-05 10:30 GMT

వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి వివాహం.. హాజరై సందడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో వివాహ వేడుకలు అంబరాన్నంటాయి. ఆయన కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షిల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విచ్చేసి సందడి చేశారు.

వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నూతన వధూవరులు సూర్య విక్రమాదిత్య – సాక్షిలను ఆశీర్వదించారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించారు.

రాష్ట్రంలోని కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతల కలయికతో వివాహ వేదిక వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు మరియు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భట్టి విక్రమార్క తన కుమారుడి పెళ్లికి విచ్చేసిన అతిథులకు సాదర స్వాగతం పలికారు.

Tags:    

Similar News