Rajyasabha Elections: ఈరోజు రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్.. హాజరుకానున్న సీఎం రేవంత్!

Meta Description: రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నేడు నామినేషన్లు వేయనున్నారు. పూర్తి వివరాలు ఇవే

Update: 2026-03-05 03:30 GMT

Meta Description

Rajyasabha ఎలేచ్షన్స్: తెలంగాణ రాష్ట్రం నుండి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈరోజు నామినేషన్స్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలను అధిష్టానం ప్రకటించింది. ఈరోజు వీరిద్దరూ తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు వీరు అధికారికంగా నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా పాల్గొననున్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో హాజరై అభ్యర్థులకు మద్దతు తెలపనున్నారు.

ముగియనున్న గడువు

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 16న రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శాసనసభ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

కాంగ్రెస్ విజయం లాంఛనమే..

కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ స్థానాల కోసం అభ్యర్థుల ఎంపికలో ఎంతో కసరత్తు చేసింది. జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ఒక స్థానానికి ఎంపిక చేయగా, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత అయిన వేం నరేందర్ రెడ్డిని రెండో స్థానానికి ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుత అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థుల విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ లేదా ఇతర పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించకపోతే, ఈ ఇద్దరు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది.

Tags:    

Similar News