తెలంగాణలో మావోయిస్టుల శకం ముగింపు.. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది భారీ లొంగుబాటు!
124 Maoists to Surrender: తెలంగాణలో మావోయిస్టుల ఆధ్యయం భారీ లొంగుబాట్లతో ముగియనుంది.
తెలంగాణలో మావోయిస్టుల శకం ముగింపు.. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట 124 మంది భారీ లొంగుబాటు!
124 Maoists to Surrender: తెలంగాణలో మావోయిస్టుల ఆధ్యయం భారీ లొంగుబాట్లతో ముగియనుంది. ఒకరో.. ఇద్దరు కాదు..124 మంది మావోస్టులు లొంగుబాటుకు రంగం సిద్ధమయ్యింది. అగ్రనేతల గెరిల్లా ఆర్మీ క్యాడర్ సహా తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్ర కమిటీలకు చెందిన మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.
ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, గంగనన్న తదితరులు ఇటీవల డీజీపీ శివదర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తాజాగా మరికొందరు మావోయిస్టులు లొంగిపోనున్నారు. సీఎం సమక్షంలో లొంగిపోనున్న వారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ క్యాడర్ తోపాటు .. ఇటీవల ఆసిఫాబాద్ అడవుల్లో అదుపులోకి తీసుకున్న 30 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. లొంగిపోనున్న వారిలో మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణ్ రావు ఉన్నట్టు తెలుస్తోంది.