Somajiguda: సోమాజిగూడలో అగ్ని ప్రమాదం.. వైన్‌షాప్‌లో మంటలు

Somajiguda: హైదరాబాద్‌ సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ రోడ్‌లో వైన్‌షాప్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Update: 2026-03-07 03:49 GMT

Somajiguda: సోమాజిగూడలో అగ్ని ప్రమాదం.. వైన్‌షాప్‌లో మంటలు

నగరంలోని సోమాజిగూడలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌ రోడ్‌లో ఉన్న ఓ వైన్‌షాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News