Harish Rao: దొడ్డిదారిన గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
Harish Rao: ప్రస్తుతం కర్ణాకటలో 50 శాతం కమిషన్ నడుస్తోంది
Harish Rao: దొడ్డిదారిన గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
Harish Rao: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దొడ్డిదారిన గెలవాలని చూస్తోందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. బెంగళరూలో జరిగిన ఐటీ దాడుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో తెలంగాణకు పెద్ద ఎత్తున నగదును బదిలీ చేయాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. కర్ణాటక నుంచి 1500 కోట్ల రూపాయలను తరలించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందన్నారు. గతంలో కర్ణాటకలో 40 శాతం కమిషన్ గవర్నమెంట్ ఉండేదని.. ప్రస్తుతం అక్కడ 50 శాతం కమిషన్ సర్కార్ నడుస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ అసోసియేషన్ అంబికాపతి ఇంట్లో చేపట్టిన ఐటీ తనిఖీల్లో 42 కోట్లు బయటపడ్డాయన్నారు హరీష్ రావు.