దుబ్బాకలో కాంగ్రెస్‌కు షాక్‌!

Narsimha reddy And Manohar Rao : దుబ్బాకలో కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలింది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న కాంగ్రెస్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2020-10-09 10:44 GMT

Narsimha reddy And Manohar Rao : దుబ్బాకలో కాంగ్రెస్ కి భారీ షాక్ తగిలింది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న కాంగ్రెస్ కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సీనియర్ నాయకులు నరసింహరెడ్డి, మనోహర్ రావులు ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ని వీడుతూ టీఆర్ఎస్ లో చేరిపోయారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో వారు ఈ రోజు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దాదాపుగా రెండు వేల మంది అనుచరులతో భారీ ర్యాలీతో వచ్చి వారు టీఆర్ఎస్ లో చేరారు. రాబోయే రోజుల్లో మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. అటు టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి రాకను కూడా కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య సమస్యలతో ఆగస్టు నెలలో మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఈ క్రమంలో నవంబరు 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటిలో ఉన్నారు. నేటి నుంచి అక్కడ నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 16న నామినేషన్లకి చివరి తేది కాగా, అక్టోబర్ 19న ఉపసంహరణ చివరి తేదీగా ఉంది. ఇక నవంబర్ 3 న ఎన్నికలు జరగగా 10 న ఫలితాలు రానున్నాయి. 

Tags:    

Similar News