logo
తెలంగాణ

ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి : మంత్రి హరీష్ రావు

ఉత్తమ్ కుమార్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి : మంత్రి హరీష్ రావు
X
Highlights

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సంఘీభావ సభ కార్యక్రమం...

సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సంఘీభావ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే చనిపోవడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తున్నారన్నారని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక వైపు ఎప్పుడు కనిపించని మనుషులు , నాయకులు ఈరోజు కనిపిస్తున్నారన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాబోయే ఎమ్మెల్యే సుజాత అక్క, అలాగే నేను ఎన్నికలు అయిపోయాక కూడా ప్రజల వైపు ఉంటామని ఆయన అన్నారు. సుజాతక్కకు ధైర్యం లేదు సుజాత ఒక స్త్రీ అంటు అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

కొన్ని చోట్ల తాను సుజాత కు అండగా ఉంటానని అనడం కూడా ప్రతిపక్షాలు ఆమెను చిన్న చూపు చూస్తూ మాట్లాడటం సరికాదన్నారు. భర్త చనిపోయిన పుట్టెడు దుఃఖంతో ఉన్న సుజాత కు తో బుట్టల ఉంటా.. సోదరునిల సహకరిస్తా అని నేను అంటే ఆమె అసమర్తురాలు అనే మాట అనడం మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా ఉత్తమ్ కుమార్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడటం ఉత్తమ్ కుమార్ రెడ్డి సమంజసం కాదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. రేపు దుబ్బాకలో ఉత్తంకుమార్ రెడ్డి మహిళలకు సమాధానం చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి మహిళలు, దుబ్బాక ప్రజలు బుద్ధి చెపుతారన్నారు. ఇవాళ గూడ్స్ ఆటో ప్యాసింజర్ ఆటో ఆటో కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ఏ పార్టీ కూడా ఎన్నికల తర్వాత ఎవరు కూడా కనిపించరని ఆయన అన్నారు. ప్రతి కూల సంఘాల గురించి ప్రతి కార్మికుల గురించి మంచి అవగాహన ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.

మరి ఈ రోజు కాంగ్రెస్ చేతిలో ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మహిళలకు కేసీఆర్ కిట్టు, రైతులకు రైతు బీమా పథకాలతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ బీజేపీ పార్టీలు ఇప్పుడు వరకు ఏం మంచి పని చేశారో చెప్పాలన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేసిన ఘనత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి దక్కిందన్నారు. దుబ్బాకలో ఉంటున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి వాకింగ్ వెళ్లి దుబ్బాకలో జరిగిన అభివృద్ధి పనులు చూడాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గం ఎన్నికల సమయంలోనే ప్రతిపక్షాలు హడావిడి చేస్తాయని ఒక్కసారన్నా దుబ్బాక వైపు చూసారా అని ప్రశ్నించారు. నేను దుబ్బాక పది సార్లు వచ్చాను అని రామలింగారెడ్డి డబుల్ బెడ్రూం 100 సార్లు సందర్శించారన్నారు. కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం నీళ్ళు ఈ జన్మలో చూస్తాము అని అనడం దానికి సమాధానంగా కేసీఆర్ నీళ్లు తేవడం జరిగిందన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ సహకారంతో రానున్న రోజుల్లో ఆటో కార్మికులకు అందరి అభివృద్ధికి కృషి చేస్తాం అన్నారు.

Web TitleMinister Harish Rao is angry with Uttam Kumar Reddy
Next Story