నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

ఉ.11 గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్‌ వార్ రూమ్‌లో సమావేశం

Update: 2023-10-08 04:35 GMT

నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం

Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేయనుంది కాంగ్రెస్. వీలైనంత త్వరగా టికెట్లు ఖరారు చేయాలని భావిస్తున్న నేపత్యంలో.. నేడు జరగనున్న సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో ఖరారు చేయనున్న అభ్యర్థుల లిస్ట్ ను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనున్నారు. మంగళవారం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం లిస్ట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత నెల నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 80 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాటి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై చర్చించలేదని.. నేటి సమావేశంలో ఆ పది స్థానాలపై చర్చ జరగనుందని సమాచారం. ఇక గత సమావేశంలో ఎల్బీ నగర్, సూర్యాపేట, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ స్థానాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో మరో 30 స్థానాల్లో రీ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఇక మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం, కసిరెడ్డి నారాయణరెడ్డి లాంటి నేతలు పార్టీలో చేరడంతో.. వీరు ఆశిస్తున్న స్థానాలపై కూడా నేటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు నేతలు. వీటితో పాటు మిగిలిన అన్ని స్థానాలపై చర్చించి.. దాదాపు మొత్తం అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News