Congress - Padayatra: నిత్యావసర ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పాదయాత్ర

Congress - Padayatra: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్లలో పాదయాత్ర

Update: 2021-12-18 02:58 GMT

Congress - Padayatra: నిత్యావసర ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పాదయాత్ర

Congress - Padayatra: దేశ వ్యాప్తంగా ఒక్కరోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. దేశంలో పెరుగుతున్న నిత్యవసర ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ఒకరోజు నిరసన పాదయాత్ర చేస్తుంది. జాతీయ పార్టీకి మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ రేపు చేవెళ్లలో ఒక్కరోజు పాదయాత్రకు ఏర్పాట్లు చేసింది.

దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒక్కరోజు నిరసన పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది. ఏడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలని పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందంటూ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఏఐసీసీ నిర్వహిస్తూనే ఉంది.

ఇక బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉత్తరప్రదేశ్ అమేథీలో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్ర చేయబోతున్నారు. ప్రియాంక, రాహుల్‌కు మద్దతుగా తెలంగాణలోని చేవేళ్లలో పీసీసీ నేతలు 10 కిలో మీటర్ల పాదయాత్ర చేయనున్నారు టీకాంగ్రెస్ ముఖ్య నేతలు.

పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్లలో చేపట్టబోయే పాదయాత్రలో జాతీయ నాయకులు దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా పాల్గొనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు చేవెళ్ల మండలం ముడిమ్యాల అంబేద్కర్ విగ్రహం నుండి చేవెళ్ల టౌన్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు పిసిసి నేతలు.

బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలన్నీ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిత్యవసర సరుకులను కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఎవరూ ఊహించని విధంగా సెంచరీ దాటేశాయని ఫైర్ అవుతున్నారు.

బీజేపీ ప్రభుత్వ పాలసీల వల్ల ధనవంతులే ధనవంతులు అవుతున్నారని.. పేద వాళ్ళు పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అమేథీ లో పాదయాత్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల సమస్యల పైన పాదయాత్రలు చేపడతామన్నారు.

Tags:    

Similar News