Rajanna Sircilla: సొంత జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ
*మంత్రి కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులు
Rajanna Sircilla: సొంత జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ
Rajanna Sircilla: సొంత జిల్లాలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఆయన్ను.. కాంగ్రెస్ నాయకులు అడ్డగించే ప్రయత్నం చేశారు. గ్రామం నుంచి మంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో.. ఆందోళన కారులు ఒక్కసారిగా దూసుకొచ్చారు.
ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాన్వాయ్ మధ్యలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.