కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్

KTR: హైదరాబాద్‌ అభివృద్ధి కోసం మరింతగా పని చేస్తాం

Update: 2023-10-05 02:10 GMT

కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్ 

Nandikanti Sridhar: హైదరాబాద్‌ అభివృద్ధి కోసం మరింతగా పని చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పది సంవత్సరాలు ప్రజల కోసం, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేశామని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్‌కు తగిన గౌరవాన్ని కల్పిస్తామన్నారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపించేందుకు పని చేస్తామని కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో మేడ్చల్, మల్కాజిగిరి డీసీసీ ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్‌లో చేరారు. నందికంటి శ్రీధర్‌తో పాటు బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags:    

Similar News