Malkajgiri: మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్
Malkajgiri: ఇద్దరు నేతలకు దీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తోన్న కాంగ్రెస్
Malkajgiri: మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్
Malkajgiri: మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆశావహుల్లో బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ స్థానంలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉద్యమకారుడు శంబిపూర్ రాజుకు టికెట్ దాదాపు ఖరారైంది. దీంతో ఈ ఇద్దరు నేతలకు దీటైన అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తోంది కాంగ్రెస్. మల్కాజ్ గిరి టికెట్ రేసులో ఇప్పటికే బండ్ల గణేష్, చంద్రశేఖర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్‌రావు ఉండగా.. మరో కొత్త నేతకు గాలం వేస్తోంది కాంగ్రెస్. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు జనార్ధన్‌రెడ్డిని తమ పార్టీ తరపున పోటీ చేయాలని కోరినట్టు సమాచారం.