మద్యం షాపుల వద్ద పరిస్థితిని పరిశీలించిన సీపీ అంజనీ కుమార్‌

లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 42 రోజుల నిర్బంధం తర్వాత తెలంగాణలో తెరుచుకోనున్న మందుషాపుల వద్ద జనం పోటెత్తారు.

Update: 2020-05-06 12:09 GMT
CP Anjani Kumar(File Photo)

లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 42 రోజుల నిర్బంధం తర్వాత తెలంగాణలో తెరుచుకోనున్న మందుషాపుల వద్ద జనం పోటెత్తారు. మద్యం దుకాణాల వద్ద మందు బాబులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరవడానికి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు మద్యం దుకాణాల దగ్గర పరిస్థితిని సీపీ అంజనీ కుమార్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో సుమారుగా 178 మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటి దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఎక్కడైనా దీన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే ఆ క్షణమే సదరు దుకాణం లైసెన్సు రద్దుచేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు కరోనాను కట్టడి చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 


Tags:    

Similar News