Hyderabad: చాట్‌లో బొద్దింక కలకలం..
Cockroach in Chat Bandar: ఎల్బీనగర్ మిఠాయి వాలా స్వీట్ షాపులో బొద్దింక కలకలం సృష్టించింది.
Hyderabad: చాట్‌లో బొద్దింక కలకలం..
Cockroach in Chat Bandar: ఎల్బీనగర్ మిఠాయి వాలా స్వీట్ షాపులో బొద్దింక కలకలం సృష్టించింది. మిఠాయి వాలా షాపులో రవి అనే వ్యక్తి పిల్లల కోసం చాట్ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లి చూసేసరికి చాట్ లో బొద్దింక దర్శనమిచ్చింది. రవి దానిని తీసుకెళ్లి కొనుగోలు చేసిన షాపు యజమానికి చూపించాడు.
అయితే యజమాని మాత్రం చాట్‌లో పడిన బొద్దింకతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులను ఫోన్ లో సంప్రదించాడు. అయితే, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎంతకీ స్పందించలేదని రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.