Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ రేపు ఉదయం 9 గంటలకు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు.
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ రేపు ఉదయం 9 గంటలకు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారా అనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత నిర్మాణంలో భాగంగా డీసీసీల నియామకం విషయంలో ఏఐసీసీ నేతలోతో భేటీ అయి చర్చిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.