Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-బెంగళూరు-చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు.
హస్తిన పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసి..తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేకంగా ఆహ్వానించారు.