CM Revanth Reddy: ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy: హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
CM Revanth Reddy: హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ పూజారులతో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి.