వాళ్లిద్దరిలాగే కవిత మా పార్టీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ లోకి దానం నాగేందర్ , కడియం వస్తారనుకున్నామా..? వచ్చారు కదా అని అన్నారు.
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ లోకి దానం నాగేందర్ , కడియం వస్తారనుకున్నామా..? వచ్చారు కదా అని అన్నారు. కవిత కూడా కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనన్నారు. జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోండి, జిల్లా స్వరూపం మాత్రం మార్చొద్దని సూచించారు. రెండు కోట్ల మంది ఉన్న నల్గొండ జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదని...తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టమన్నారు మల్ రెడ్డి రంగారెడ్డి.