Fake Certificate Scam: వికారాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టు
Fake Certificate Scam: వికారాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టయ్యింది.
Fake Certificate Scam: వికారాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ల దందా గుట్టురట్టయ్యింది. బషీరాబాద్‌లో ప్రవీణ్ అనే యువకుడు ఆన్లైన్ సర్వీస్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రజల నుంచి ధరఖాస్తులను స్వీకరించి.. జనన, మరణ దృవపత్రాలు, ఈసీలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారీ చేసి లక్షలు దోచుకుంటున్నాడు. మంతన్ గౌడ్ తండాకు చెందిన సభావత్ పరమేశ్ చౌహాన్, సవితాచౌహాన్ దంపతుల కుమారుడుకి జనన ధ్రువీకరణపత్రం కోసం ప్రవీణ్ దగ్గర ఆన్లైన్‌లో నమోదు చేసుకున్నారు. అవి ఫేక్ సర్టిఫికెట్లని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జిరాక్స్ సెంటర్ నడుపుతున్న ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు.