CM Revanth Reddy: మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించం
CM Revanth Reddy: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నిబంధనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
CM Revanth Reddy: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నిబంధనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం మార్పుల వెనుక పేదల హక్కులను హరించే కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
పేదలపై కక్షతోనే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) మార్చుతున్నారని మండిపడ్డారు. నిబంధనల మార్పు పేరుతో ఈ పథకాన్ని శాశ్వతంగా కనుమరుగు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
అధికారం ఉందని, మెజారిటీ ఉందని చట్టసభలను ఉపయోగించుకుని పేదలను అణచివేస్తామంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పథకం ఎందరో పేదల జీవితాల్లో మార్పు తెచ్చిందని ఆయన గుర్తుచేశారు.
2024 ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేయాలని బీజేపీ భావించిందని, కానీ ప్రజలు అప్రమత్తమై వారిని 240 సీట్ల వద్దే నిలువరించారని రేవంత్ రెడ్డి అన్నారు. తద్వారా కార్పొరేట్లకు దేశాన్ని కట్టబెట్టే ప్రయత్నం తాత్కాలికంగా ఆగిపోయిందని తెలిపారు.
ఓట్లను తొలగించేందుకు కేంద్రం తీసుకువచ్చిన ఎస్ఐఆర్ విధానం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిని ప్రజలందరూ గమనించాలని సూచించారు.