KTR: రాహుల్‌గాంధీకి మైనార్టీలపై ఉన్న ప్రేమ ఇదేనా...?

KTR: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) విద్యార్థులు తమ వర్సిటీ భూములను కాపాడుకునేందుకు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంఘీభావం తెలిపారు.

Update: 2026-01-09 09:27 GMT

KTR: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) విద్యార్థులు తమ వర్సిటీ భూములను కాపాడుకునేందుకు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంఘీభావం తెలిపారు. శుక్రవారం వర్సిటీ విద్యార్థులతో భేటీ అయిన ఆయన, ప్రభుత్వం విద్యాసంస్థల భూములపై కన్నేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

రాహుల్ గాంధీకి మైనార్టీలపై ప్రేమ ఇదేనా?

ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. "ఒకవైపు దేశవ్యాప్తంగా మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, ఇక్కడ మౌలానా వర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని ప్రశ్నించారు. మైనార్టీలపై ఆయనకు ఉన్న ప్రేమ కేవలం మాటలకే పరిమితమా అని నిలదీశారు.

వరుసగా వర్సిటీ భూములపై కుట్రలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాసంస్థల భూములను హరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. గతంలో అగ్రికల్చర్ వర్సిటీ (PJTSAU) భూములను హైకోర్టు భవనం కోసం సేకరించడంపై ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములపై కూడా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు మౌలానా వర్సిటీ వంతు వచ్చిందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం తగదని హెచ్చరించారు.

విద్యార్థులకు అండగా ఉంటాం:

విద్యార్థులు చేస్తున్న ఈ భూ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యాసంస్థల అభివృద్ధికి భూములు ఇవ్వాల్సింది పోయి, ఉన్న భూములను లాక్కోవడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News