సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. అధికారుల మెమోలపై ప్రశ్నల వర్షం!

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2026-01-09 10:21 GMT

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని ఒకవైపు ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు ధరల పెంపునకు అనుకూలంగా మెమోలు జారీ చేయడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

హైకోర్టు వేసిన కీలక ప్రశ్నలు:

టికెట్ ధరలు పెంచబోమని స్వయంగా సంబంధిత మంత్రే ప్రకటించినప్పుడు, మళ్ళీ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమోలు ఎందుకు ఇస్తున్నారని గవర్నమెంట్ ప్లీడర్ (GP)ను కోర్టు ప్రశ్నించింది.

 "మెమో ఇచ్చే అధికారికి కనీస నిబంధనలు తెలియవా? ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదు" అంటూ అధికారుల తీరుపై ధ్వజమెత్తింది.

నిబంధనలను అతిక్రమిస్తూ, తెలివిగా మెమోలు జారీ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం తరచూ ప్రత్యేక అనుమతులు ఇస్తోంది. అయితే, సామాన్య ప్రేక్షకులకు భారంగా మారుతున్న ఈ నిర్ణయాలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిబంధనల ప్రకారం కాకుండా కేవలం మెమోల ద్వారా ధరలను ఎలా పెంచుతారని ప్రభుత్వాన్ని నిలదీసింది.

Tags:    

Similar News