DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట

DGP Shivadhar Reddy: తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Update: 2026-01-09 11:19 GMT

DGP Shivadhar Reddy: తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, దానిని కొట్టివేస్తూ డీజీపీకి ఊరటనిచ్చింది.

నియామక ప్రక్రియపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ బాధ్యతల్లో ఉన్న శివధర్ రెడ్డి నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం, ప్రస్తుత నియామకంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూనే, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శాశ్వత డీజీపీ నియామకంపై దృష్టి పెట్టాలని సూచించింది.

ఈ తీర్పుతో గత కొంతకాలంగా డీజీపీ నియామకంపై సాగుతున్న న్యాయపరమైన ఉత్కంఠకు తెరపడినట్లయింది. ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు యూపీఎస్సీ (UPSC) నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయనున్నాయి.

Tags:    

Similar News