KTR: అవకాశ వాదంతో జూపల్లి కాంగ్రెస్ లోకి వెళ్లారు

KTR: రేవంత్ రెడ్డి ఎవరికి దేవుడు.. ఎవరికి ఇంద్రుడు.. ఎవరికి చంద్రుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

Update: 2026-01-08 09:43 GMT

KTR: రేవంత్ రెడ్డి ఎవరికి దేవుడు.. ఎవరికి ఇంద్రుడు.. ఎవరికి చంద్రుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కొల్లాపూర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు అవకాశవాదని.. స్వార్ధం కోసం కాంగ్రెస్ లోకి వెళ్లి కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడి యుద్దాలు చేస్తుంటే కనిపించడం లేదా అన్నారు. గ్యారెంటీ కార్డులు అయిపోయాయి.. యూరియా కార్డు తీసుకు వచ్చి పాలమూరును ఎండబెట్టి రైతులతు తొక్కుతున్నారని విమర్శించారు. నీళ్లు లేని దగ్గర మోటార్లు పెడుతారా అన్నారు.. రేవంత్ రెడ్డికి ఏమి తెలుసని ఆయన నీటి పాఠాలు నేర్చుకోవాలన్నారు.

Tags:    

Similar News