మేడారం జాతరకు కేసీఆర్‌కు ఆహ్వానం: స్వయంగా వెళ్లిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ!

Update: 2026-01-08 12:15 GMT

మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మంత్రులకు ఆత్మీయ స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా పసుపు-కుంకుమ, నూతన వస్త్రాలు, తాంబూలాలతో మంత్రులను గౌరవంగా సత్కరించారు.

ఆహ్వాన అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ముఖ్య నేతలను జాతరకు ఆహ్వానిస్తున్నామని ఆమె తెలిపారు. "మేము స్వయంగా వచ్చి కేసీఆర్ గారిని ఆహ్వానించాం. ఆయన మా ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించారు. మేడారం జాతరకు తప్పకుండా వస్తానని ఆయన హామీ ఇచ్చారు" అని సీతక్క పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, జాతర విజయవంతానికి అందరి సహకారం కోరుతున్నామని మంత్రులు తెలిపారు.


Tags:    

Similar News