Bhatti Vikramarka: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన
Bhatti Vikramarka: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Bhatti Vikramarka: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన
Bhatti Vikramarka: సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్‌లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో సింగరేణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు భట్టివిక్రమార్క సమాధానం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థని వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులపై అందరిపై ఉందన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.