Kishan Reddy: వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సీఎం రేవంత్‌కి మంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy: వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Update: 2026-01-06 09:07 GMT

Kishan Reddy: వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సీఎం రేవంత్‌కి మంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy: వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములను భారత పురావస్తు శాఖకు చెందినవిగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. కోట పరిసరాల్లో జరిగిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. ఆక్రమణదారులపై పురావస్తు శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న కోట భూములను ASI భూములుగా సవరించాలని తెలిపారు.

వరంగల్ కోట చుట్టూ ఉన్న 7 ప్రాకారాల్లో ప్రస్తుతం 3 మాత్రమే మిగిలాయాని.. మిగిలిన ప్రాకారాల భూముల్లో స్థానికులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ఆక్రమణలపై ASI అధికారులు పలుమార్లు నోటీసులు, లేఖలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. చారిత్రక వారసత్వ సంపదను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సీఎంకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News