CM KCR: ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: కొల్లాపూర్ పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బహిరంగ సభ
CM KCR: ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
CM KCR: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంద్వారా నాగర్ కర్నూలు వెళ్తారు. మధ్యాహ్నం నాగర్ కర్నూల్‌లోని తేజ గార్డెన్స్‌కు చేరుకుంటారు. అక్కడ భోజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు నార్లాపూర్ రిజర్వాయర్ సమీపంలోని కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. అక్కడ కాసేపు రిజర్వాయన్ సందర్శిస్తారు. అనంతరం కంట్రోల్ రూమ్‌లో కేసీఆర్ మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. నాలుగు గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. నాలుగు గంటల 45 నిమిషాలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఐదు గంటలకు రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకుంటారు. అనంతరం కొల్లాపూర్ లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్‌కు బయలుదేరి వెళ్తారు.