CM KCR: ఇంటికి పది లక్షలు ఇస్తే ఏం చేస్తారు..?

CM KCR: దళితబంధు పథకం గురించి తెలుసా..? ఇంటికి పది లక్షలు ఇస్తే ఏం చేస్తారు..? డబ్బులు చేతికందగానే దేనికి ఖర్చుచేస్తారు.?

Update: 2021-08-04 11:54 GMT

CM KCR: ఇంటికి పది లక్షలు ఇస్తే ఏం చేస్తారు..?

CM KCR: దళితబంధు పథకం గురించి తెలుసా..? ఇంటికి పది లక్షలు ఇస్తే ఏం చేస్తారు..? డబ్బులు చేతికందగానే దేనికి ఖర్చుచేస్తారు.? ఇవీ వాసాల మర్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలు. దాదాపు మూడు గంటల పాటు వాసాల మర్రి గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితబంధు పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా ఆ నిధులను సద్వినియోగం చేసుకోవడంపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.

మరోవైపు ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం ఇచ్చారు. దళితబంధు సొమ్ముతో కొందరు పాల డైరీ పెట్టుకుంటామంటే మరికొందరు ట్రాక్టర్‌లు కొంటామన్నారు. ఇక ఈ మూడు గంటల పర్యటనలో పెన్షన్ సహా అనేక అంశాలపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెన్షన్ రానివాళంలెవరైనా ఉంటే వెంటనే మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్‌, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరోవైపు దళిత వాడల్లో కలియదిరిగిన ముఖ్యమంత్రి మట్టిగోడలతో కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను చూసి చలించిపోయారు. కొన్ని ఇళ్ల లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం ప్రతి ఒక్కరికీ ఇండ్లు మంజూరు చేస్తామని, దిగులు పడొద్దని భరోసానిచ్చారు. అలాగే, నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను ముఖ్యమంత్రి జాగ్రత్తగా విని అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ముఖ్యమంత్రి పర్యటన ఆధ్యంతం గ్రామాభివృద్ధే లక్ష్యంగా సాగింది.

Tags:    

Similar News