Medaram: ఇవాళ మేడారానికి సీఎం కేసీఆర్

Medaram: సమ్మక్క- సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకోనున్న సీఎం కేసీఆర్.

Update: 2022-02-18 04:12 GMT

Medaram: ఇవాళ మేడారానికి సీఎం కేసీఆర్

Medaram: సీఎం కేసీఆర్‌ ఇవాళ మేడారం మహాజాతరలో పాల్గొని సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి వస్తారని అధికారులు తెలిపారు. కేసీఆర్‌ మేడారంలో సుమారు మూడు గంటలకుపైగా గడుపుతారని, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని వెల్లడించారు.

సీఎం వెంట ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు సమీక్షించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు.

కేంద్ర మంత్రులు రేణుకాసింగ్, జి.కిషన్‌రెడ్డి వేర్వేరుగా మేడారం చేరుకుని వన దేవతలను దర్శించుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా వస్తారని ఆయా పార్టీల వర్గాలు ప్రకటించాయి.   

Tags:    

Similar News