Yadadri Temple: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
Yadadri Temple: సీఎం కేసీఆర్ వరంగల్, యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం పర్యటించనున్నారు.
Yadadri Temple: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
Yadadri Temple: సీఎం కేసీఆర్ వరంగల్, యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. వరంగల్ పర్యటన ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.
పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లేఅవుట్, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్ సూట్‌ను పరిశీలిస్తారు. ప్రధానాలయ ప్రాకార గోపుర సముదాయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌ను వీక్షిస్తారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌ్‌సకు వెళతారు. సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.